•    Follow Us 
About Us.....

మట్టిని బంగారంగా మార్చగలిగినవాడు మనిషి. మట్టినుండి మాణిక్యాలను వెలికితీయగల నేర్పరి మనిషి. మట్టిలోనుండి వెలికితీసిన ఖనిజాలను మానవ అవసరాలకు అనుగుణంగా మలచగలిగినవాడు మనిషి. చలనంలేని వస్తువులలో చలనం సృష్టించగలవాడు మనిషి. రాగి తీగలలో రాగాలు పలికించిన వాడూ మనిషే! రాళ్ళకు సజీవ రూపకల్పన చేయగలిగిన వాడూ మనిషే!.

అందుకే మనిషిని మహనీయుడు అన్నారు. అంతటి మహనీయతను నిలుపుకొన్న జాతి మనది, సృష్టి ప్రారంభము నుండి నేటి వరకు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మానవ సమాజానికి ఉపయోగపడుతూ సృష్టికి ప్రతిసృష్టిని సృష్టిస్తూ అపర బ్రహ్మలుగా అందరిచేత నీరాజనాలు అందుకొంటున్న మన విశ్వబ్రాహ్మణులు ఈ మద్యకాలంలో మనజాతి పుట్టుపూర్వోత్తరాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర ముదలగున్నవి తెలుసుకొనుటలో మరియు నభ్య సమాజానికి తెలియజేయుటలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే చెప్పవచ్చు. ఏదిఏమైనా ఇప్పటికైనా మన కులస్థులకు, ఇతర జాతులవారికి, ఇతర కులాలవారికి మనజాతి పుట్టుపూర్వోత్తరాలు, ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను, చరిత్రలను తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కులాలే లేవనే ఈ రోజుల్లో ఇవన్ని అవసరమా? అని కొందరికి అనిపించవచ్చు. కానీ కులాలు లేవంటూనే ఏ కులంవారు ఆ కులాన్ని, ఏ మతంవారు ఆ మతాన్ని పరిక్షించుకుంటూ, ఆయా కులాలవారు, ఆయా మతాలవారు తమతమ కుల, మత అభ్యున్నతికి, వారివారి కులాభివృద్దికి పాటుపడుతున్నారు. కావున మన విశ్వబ్రాహ్మణ కులస్థులు కూడా కుల వ్యవస్థ నిర్మూలన జరిగే వరకు మన కులాన్ని, కులస్థుల అభ్యున్నతికి పాటుపడి, సంఘంలో మనకున్న విలువలను కాపాడుకోవాలని కోరుకుందాం.

ఈ దృడ సంకల్పంతోనే 2000 సంవత్సరములో "విశ్వకర్మ ప్రభ" రాజకీయ సామాజిక చైతన్య మాస పత్రికను స్థాపించి ఒక దశాబ్దంపాటు సమైఖ్యాంద్రతో పాటు కర్నాటక, తమిళనాడు ఒరిస్సా మొదలైన పొరుగు రాష్ట్రాలలోని మన కులస్థులకు, సంఘీయులకు, యావత్ జాతికి రాజకీయ, ఆర్థిక, సామాజిక చైతన్య వ్యాసాలను అందిస్తూ ఇతోధికంగా ప్రసిద్ద విశ్వబ్రాహ్మణ సాహితీవేత్తలతో, పండితులతో, ఔత్సాహిక రచయితలతో ఎన్నో వ్యాసాలను, శీర్షికలను, సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, మన కులస్థులలో మంచి పేరు ప్రఖ్యాతులు కల్గిన ప్రముఖులను పరిచయంచేసి మనకులానికి కులస్థులకు వెన్నుదన్నుగా నిలిచిందనే చెప్పవచ్చు. మారుతున్న పస్తుత పరిస్థితుల్లో మన విశ్వబ్రాహ్మణ కుల విశిష్టతను, కులస్థులలో వున్న ప్రముఖ వ్యక్తులను, వారు సాదించిన ఘనతను అంతర్జాలంద్వారా ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయాలనే తలంపుతో "విశ్వబ్రాహ్మిణ్.ఇన్" పేరుతో ఒక వెబ్ సైట్ ప్రారంభించడం జరిగింది. దీనిద్వారా మన కులంయొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, ఈ మధ్యకాలంలో మన కులంపై ఇతరులకు ఏర్పడిన చిన్నచిన్న అపోహలను తొలగించి, వాస్తవాలను బహిర్గతం చేసి విశ్వబ్రాహ్మణులకు పూర్వ వైభవం కల్పించాలనేదే తాపత్రయం. అలాగే ఎంతో శ్రమకోర్చి సేకరించిన విషయాలను మరుగున పడకుండా అందరికీ అందుబాటులో ఉంచాలనే మా చిన్న ప్రయత్నానికి మీ వంతు సహాయ సహకారములు, తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని అక్కున చేర్చుకొని పెద్ద మనస్సుతో ఆశీర్వదిస్తారని వినమ్రతతో.......