•    Follow Us 
విశ్వబ్రాహ్మణుల ధర్మాలు:
విశ్వబ్రాహ్మణ వ్యక్తి పేరుకు ముందు ఇంటిపేరు, దానికి ముందు "బ్రహ్మశ్రీ" అని, పేరుకు చివర ఆచార్యులు, శర్మ , శాస్త్రి అని వ్రాయుట ధర్మము. (వృత్తి పేర్లు ఇంటిపేరుగా, కులం పేరుగా చెప్పుకొనరాదు. వ్రాసుకొనరాదు) | గోత్రం, ప్రవర, సూత్రం, కుండం, దండం, శాఖ వివరములు తెలుసుకొని వాటిని ప్రతినిత్యం చెప్పుకొనుట ధర్మం. | యజ్ఞోపవీతము (జందెము)ను ఉపనయన సంస్కారము నుండి జీవితాంతము ధరించుట ధర్మము. బ్రహ్మచారి ఒక్కముడి యజ్ఞోపవీతము (జందెము)ను, గృహస్థులు ఐదు ముడుల యజ్ఞోపవీతము (జందెము)ను ధరించాలి. | నిత్యకర్మలు ప్రతి దినం చేయుట ధర్మం - బ్రహ్మ ముహూర్తమున అనగా ఉదయం 4-00 గంటల నుండి 6-00 గంటల లోపుల నిద్రమేల్కొని, భగవధ్యానము చేయుట, కాలకృత్యములు, స్నానము, సంద్య చేయుట. విభూతి, గంధం, కుంకుమ బొట్టు ధరించి ప్రాణాయామము, గాయత్రి మంత్రధ్యానము, సూర్య భగవానునికి ఆర్థ్యమును ఇచ్చుట. పితృ, పితామహులకు తర్పణం ఇచ్చుట గీత, కాలజ్ఞానము, వేదాధ్యయనము మొదలైనవి పఠించుట ధర్మం. | ప్రతి నిత్యం పంచ మహాయజ్ఞములు చేయుట ధర్మము. పంచ మహాయజ్ఞములు అనగా బ్రహ్మ యజ్ఞము, దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, అతిథి యజ్ఞము, భూత యజ్ఞములు ఆడంబరాలు లేకుండా త్రికరణ శుద్దిగా నిర్వహించాలి. | వైదిక కర్మలతోపాటు శిల్ప యజ్ఞములు - అయో, దారు, తామ్ర, శిలా, స్వర్ణ శిల్పములు చేయుట ధర్మము. వ్యాపారస్థులు, ఉద్యోగస్థులు వారి వారి దాయిల సంప్రదాయం ప్రకారం వారి దాయికి సంబంధించిన కనీసం రెండు లేదా మూడు పనిముట్లను వారి గృహంలో వాడాలి. పూజించాలి. | నైమిత్తిక కర్మలు అనగా షోడశ సంస్కారములు శాస్త్రం నిర్ణహించిన సమయమున చేయుట ధర్మము. 1. గర్భాదానము, 2. పుంసవనము, 3. సీమంతము, 4. జాతకర్మ, 5. నామకరణము, 6. నిష్క్రమణము, 7. అన్నప్రాశనము, 8. చౌలము/కేశఖండనము, 9. అక్షరాభ్యాసము, 10. ఉపనయనము, 11. బ్రహ్మచర్య వ్రతము, 12. స్నాతకము, 13. వివాహము, 14. గృహ ప్రవేశము, 15. వానప్రస్థము, 16. అంత్యేస్ఠి | వైదిక కర్మలు, నైమిత్తిక కర్మలు చేయునపుడు పురుషులు దోవతి, ఉత్తరీయమును, స్త్రీలు చీర జాకెట్టు లాంటి సంప్రదాయ దుస్తులు ధరించుట ధర్మము. | శాఖాహారమును (సాత్వికాహారము) భగవదార్పణ చేసి భుజించుట ధర్మం. ప్రతి విశ్వబ్రాహ్మణుడు తరచుగా తన సమీపంలోని విశ్వబ్రాహ్మణుల ఇంద్లకు వెళ్లి విషయములు తెలుసుకుంటూ, వారి యోగక్షేమములు విచారించుట ధర్మము. "విశ్వబ్రాహ్మణులు సదాచారము పాటింతురు గాక" |
Book Shelves
  విశ్వబ్రాహ్మణ సాహిత్య గ్రంథములు
ముద్రణ సం॥ము
గ్రంథకర్త / ప్రచురణ కర్త పేరు
Details
  విశ్వకర్మ తాళపత్ర గ్రంథము (వ్రాత ప్రతి)
సుమారు 630 సం॥లు
గౌరీపట్టపు అన్నావధానులు
  నాగర ఖండము
1986
డా॥ కొండూరు వీర రాఘవాచార్య
  మూల స్థంభము
1982
నూతక్కి చిన్నయ్యాచార్యులు
  ధర్మపాల విజయము
1971
వంగవోలు ఆదిశేషశాస్త్రి
  శ్రీ విశ్వకర్మ పురాణము
2002
డా॥ కొండూరు వీర రాఘవాచార్య
  విశ్వకర్మ విశ్వరూపము
1990
డా॥ కొండూరు వీర రాఘవాచార్య
  శ్రీ విశ్వకర్మ శతకము
1931
రామసింహ కవి
  విశ్వకర్మ శతక ఖండన మండలము
1931
నుమకొండ సత్యనారాయణాచారి
  విశ్వప్రకాశ మండలము
1931
రామసింహ కవి
  విజయధ్వజి, (గుంటూరు జిల్లా తీర్పు)
1957
దేశభక్త వోలేటి సుబ్రహ్మణ్యశర్మ
  విశ్వరహస్య ప్రకాశము
1977
శానంపూడి మల్లెం కొండయ్యాచార్యులు
  చిత్తూరు జిల్లా అదాలత్ కోర్టు తీర్పు
1989
పాండూరు కుప్పాచార్యులు
  రథకారాధికరణమ్
1999
శ్రీ కనపర్తి బసవాచార్య స్వామి
  విశ్వకర్మ బ్రాహ్మణ వంశాగమము
1934
డ్డెపాటి నిరంజనశాస్త్రి
  పరిమళచోళ చరిత్రము
1984
చెరుకూరి శివరామ బ్రహ్మేంద్రస్వామి
  విశ్వకర్మ - ఆయన సంతతి
2001
లంపురి బ్రహ్మానందం
  విశ్వకర్మ చరిత్ర
1958
డా॥ కొత్తపల్లి లక్ష్మీకాంతరావు
  ధీరజన మనోవిరాజితము
2000
తెనాలి రామలింగకవి
  మహా మాయాదేవి (ధర్మపాల విజయము)
1992
నాగశ్రీ
  విశ్వబ్రాహ్మణ గురుపీఠములు
1988
నారాయణదాసు శ్రీ రామాచార్యులు
  శ్రీ విశ్వకర్మ వ్రతకల్పము
1992
స్వర్ణ సుబ్రహ్మణ్య కవి
  జాతివంశనామ సముద్దరణోపదేశము
1986
కె.ఎల్. నారాయణాచార్యులు
  విశ్వబ్రాహ్మణ పతనోద్దరణము బుర్ర కథ
1986
కె.ఎల్. నారాయణాచార్యులు
  విశ్వకర్మ అనగా ఎవరు?
1999
కురిచేటి శివకుమార్ ఆచార్యులు
  విశ్వబ్రాహ్మణ గోత్రగాయత్రి
1984
ణిదపు ప్రభాకర శర్మ (విభావసు)
  ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘ ఉద్యమ చరిత్ర
2005
శ్రీపాద రామనర్సయ్య
  శ్రీ విశ్వకర్మ గోత్ర బ్రహ్మర్షి స్తవము
2012
ముంజంపల్లి వీరబ్రహ్మేంద్రాచార్య
  విశ్వబ్రాహ్మణులకు ప్రథమ సత్కారార్హత
1979
స్వర్ణ సుబ్రహ్మణ్య కవి
  గోత్రాది విజ్ఞాన సంధ్యావందన దర్పణమ్
1962
చిలకలపూడి రాజలింగాచార్యులు